మన సమాజంలో జరిగిన సంఘటనలే సినిమాలుగా తెరకెక్కుతుంటాయి. మన చుట్టుపక్కల జరిగే ఘటనల ఆధారంగానే వాటి నుండి వచ్చిన ఆలోచనలతోనే డైరెక్టర్లు సినిమాలు తెరకెక్కిస్తుంటారు. అలా సినిమాలు తీసి సంచలన విజయాలు సాధించడంలో లెజెండరీ డైరెక్టర్ శంకర్ ముందుంటారు. జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శంకర్ మొదటి సినిమాతోనే సంచలన విజయం దక్కించుకున్నాడు. అయితే అందరూ తీసే కమర్షియల్ సినిమాలకు తన సినిమాలు విభిన్నంగా ఉంటాయి. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు మన సౌత్ సినిమాసత్తా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలియచేసిన మొదటి దర్శకుడు శంకర్. సినిమా సినిమాకు వైవిద్యతను ముఖ్యంగా సాంకేతికతను కొత్తగా చూపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసేవారు. ఒకే ఒక్కడు, భారతీయుడు, ప్రేమికుడు, జీన్స్, అపరిచితుడు, త్రీ ఇడియట్స్, శివాజీ, రోబో ఇలా ప్రతి సినిమా ఒక సంచలనమే. ముఖ్యంగా రోబోతో శంకర్ దేశం గర్వించదగ్గ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ మేకర్లెవరూ అడుగుపెట్టని ‘స్టాన్ విన్స్ టన్’ యానిమేషన్ స్టూడియోలో శంకర్ తన రోబోను రూపొందించారు. ‘టెర్మినేటర్’, ‘జురాసిక్ పార్క్’, ‘అవతార్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ ఈ స్టూడియోలోనే జరిగాయి. స్టాన్ విన్స్ టన్లో షూటింగ్ జరుపుకున్న తొలి భారీతీయ చిత్రంగా శంకర్ ‘రోబో’ రికార్డ్ క్రియేట్ చేసింది
ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాపై భారీఅంచనాలే ఉన్నాయి. మరి ఇప్పటి వరకూ శంకర్ తీసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలపండి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: