పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ – నిఖిల్

Nikhil Thanks Pan india star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Nikhil,Nikhil Siddharth,Hero Nikhil,Nikhil Thanks Prabhas,Prabhas Upcoming Movies,Prabhas Latest Updates, Prabhas Pan India Star,Pan India Star Prabhas,Nikhil Latest Blocbuster Movie Karthikeya 2,Karthikeya 2 Movie Latest Updates,Karthikeya 2 Movie Latest News,Nikhil Thanks Pan India Star Prabhas

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నార్త్ లో కార్తికేయ 2 మూవీ కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.ప్రస్తుతం నార్త్‌లో “కార్తికేయ 2” సినిమాకు రోజుకు రోజుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్స్ పెరుగుతున్నాయి. కార్తికేయ 2 మూవీని సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా టీమ్ కు అభినందనలు తెలిపారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, చందూ మొండేటి, భైరవుడు, కార్తికేయ2 టీమ్ సభ్యులందరికీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ట్వీట్ పట్ల నిఖిల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభాస్ భాయ్ మీ విషెస్ కి ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. మీ మెసేజ్ తో కార్తికేయ2 టీమ్ ఎంతో సంతోషపడింది అని పేర్కొన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =