ది ఘోస్ట్ పవర్ ఫుల్ కత్తి మేకింగ్

Nagarjuna’s The Ghost Movie New Making Video Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,The Ghost,The Ghost Telugu Movie,The Ghost Movie Latest Updates,The Ghost Movie Latest Updates,The Ghost New Movie Updates,The Ghost Movie Updates,Akkineni Nagarjuna The Ghost Movie,Nagarjuna Upcoming Movie The Ghost,Nagarjuna The Ghost New Making Video Out Now,The Ghost Movie New Making Video Out Now

టాలీవుజ్ అగ్రహీరో నాగార్జున కూాడా ఎక్కడా తగ్గట్లేదు. కొడుకులకు పోటీ ఇస్తూ మరీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఈఏడాది బంగార్రాజు తో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు హిందీలో తను చాలా సంవత్సరాల తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. తమహగనే అనే పేరుతో ఈ వీడియోను రిలీజ్ చేశారు. తమహగనే అంటే అర్థం ఏమిటో ఇప్పటికే అందరికీ ఓ ఐడియా వచ్చి ఉంటుంది కదా. అంటే విలువైన ఉక్కు అని అర్థం. తనను అటాక్ చేయడానకి వస్తున్న వారితో యుద్దం చేయడానికి సిద్దంగా రెడీ అవుతున్నాడు. దానికోసం నాగార్జున స్వయంగా ఆ కత్తిని తయారు చేసినట్లుగా వీడియోలో చూపించడం జరిగింది. నాగార్జున కత్తిని తయారు చేసుకునే విజువల్స్ అన్నీ సాలిడ్ గా ఉన్నాయి. దీనితో అయితే సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి. ఇంకా ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి అట్రాక్షన్ అని చెప్పాలి.

కాగా ఈసినిమాలో నాగార్జున లుక్ రిలీజ్ చేసినప్పుడే తన చేతిలో కత్తి ఉండటం చూశాం. అంతేకాదు ఇటీవల పలు సందర్బాల్లో చిత్రయూనిట్ కూడా ఈ కత్తి గురించి చెబుతూ వస్తుంది. జపాన్ లో మాత్రమే లభించే అత్యంత అరుదైన ఉక్కుతో ఈ ఖడ్గం ను తయారు చేయించారని… జపాన్ లో ఈ ఖడ్గం ను కటన అని పిలుస్తారని తెలిపారు.

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + sixteen =