సీతారామం మూవీ పై మాజీ ఉప రాష్ట్రపతి ప్రశంసలు

Vice President Venkaiah Naidu is All Praises for Sita Ramam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Sita Ramam Movie, Sita Ramam Telugu Movie, Sita Ramam Movie Updates,Vice President Venkaiah Naidu,Vice President Venkaiah Naidu About Sita Ramam Movie,Venkaiah Naidu All Praises Sita Ramam Movie,Sita Ramam Movie Latest Updates,Vice President Venkaiah Naidu About Sita Ramam Movie

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.సీతారామం మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజా గా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా సీతారామం మూవీ పై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందనీ , .సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన సీతారామం మూవీ ప్రతీ ఒక్కరూ తప్పక చూడదగినదనీ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 7 =