‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మీరే హీరోలా ఉన్నారు సాంగ్ రిలీజ్

Meere Herolaa Lyrical Song Out From Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Songs Released,Aa Ammayi Gurinchi Meeku Cheppali Meere Herolaa Song Released,Meere Herolaa Lyrical Song Released,Meere Herolaa Lyrical Song From Aa Ammayi Gurinchi Meeku Cheppali

ఇంద్రగంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈసినిమాకు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ లేటు అవుతూ వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. వచ్చే నెల సెప్టెంబర్ 16న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి తాజాగా మీరే హీరోలా ఉన్నారు అనే పాటను రిలీజ్ చేశారు. అయితే ఈపాట వెరైటీగా ప్లాన్ చేశారు. ఈసినిమాలో సుధీర్ బాబు డైరెక్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో సుధీర్ ను జర్నలిస్ట్ లు పలు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు, ఈ సమాధానాలే పాట. ‘అందంగా వున్నారు మీరే హీరోగా చేయచ్చు కదా అని అడగడం, దానికి సుధీర్ బాబు, మనకెందుకు అండీ, మన దగ్గర చాలా మంది మంచి హీరోలు వున్నారు కదా అనడం…ఇలా అంతా ఓ పాటలా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను విజయ్ బృందం ఆలపించింది.

 

ఇక ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 15 =