లైగర్ తో ఇండియాను షేక్ చేస్తామనే నమ్మకం ఉంది – విజయ్ దేవరకొండ

Vijay Deverakonda about Liger Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Liger, Liger Movie, Liger Pan India Movie, Liger Movie Latest Updates,Hero Vijay Deverakonda,Vijay Deverakonda About Liger Movie,Vijay Deverakonda Latest Updates About Liger Movie,Vijay Deverakonda About Liger Movie in Interview

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్, ఆఫట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లైగర్ ” మూవీ ప్రమోషన్స్ లోభాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న విజయ్ “లైగర్ ” మూవీ గురించి పలు విశేషాలు తెలిపారు. విజయ్ మాట్లాడుతూ .. “లైగర్ ” మూవీ ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తెలుగు మూవీ అనీ , “టాక్సీవాలా”మూవీ సక్సెస్ తో దర్శకుడు పూరి గారు ఈ మూవీ అవకాశం ఇచ్చారనీ , ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ “అర్జున్ రెడ్డి ” మూవీ చూసి , హిందీ మూవీ పై ఆసక్తి ఉంటే బాలీవుడ్ లో పరిచయం చేస్తానని అన్నారనీ , “లైగర్ ” మూవీ ని పూరి సార్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకొనడంతో ఈ ప్రాజెక్ట్ లో కరణ్ జోహార్ ఎంటర్ అయ్యారనీ , ‘అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి”.. సినిమా అంటే తనకు చాలా ఇష్టమనీ , ఆ సినిమాలో లానే ఇందులోనూ మదర్‌ సెంటిమెంట్‌ ఉంటుంది. కానీ.. ఈ రెండు కథలూ ఒకటి కావనీ , మైక్‌ టైసన్‌తో ఫైటింగ్‌ సీన్‌ ఒకటి ఉందనీ , దాంతో మా అమ్మ చాలా భయపడిందనీ , తన దృష్టిలో మేం నిజంగానే కొట్టుకొంటాం అనుకొందనీ , మైక్‌ టైసన్‌ని తొలిసారి కలుసుకొన్నప్పుడు తనకు కుడా కొంచెం భయంగానే అనిపించిందనీ , ఆయన హైటూ, పర్సనాలిటీ చూసి కంగారొచ్చిందనీ , తను చాలా మంచి వ్యక్తి అనీ , ఈ కథ రాసుకొన్నప్పుడే టైసన్‌ పాత్ర ఉందనీ , టైసన్‌ రాకతో ఈ సినిమా స్థాయి పెరిగిందనీ , తాను మంచి డ్యాన్సర్ కాననీ , అనన్య మంచి డాన్సర్‌ అనీ , తను బాగా చేసినా తన మూమెంట్‌ కుదరకపోవడంతో తనకు తానే కట్‌ చెప్పుకొనేవాడిననీ ,అనన్య తన కోసం చాలా ఓపిక పట్టిందనీ , పూరి సార్ తో వర్క్ చేయడం అద్భుతమనీ , ఆయన గోల్డెన్ హార్టెడ్ మ్యాన్ అనీ , ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అనీ , ఈ మూవీ లో తనను అద్భుతంగా ప్రెజెంట్ చేశారనీ , “లైగర్ ” తో ఇండియాను షేక్ చేస్తామనే నమ్మకం ఉందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =