శాకిని డాకిని రిలీజ్ డేట్ ఖరారు

Saakini Daakini Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini Movie Release Date Locked,Saakini Daakini Upcoming Movie Release Date Locked,Regina Cassandra,Nivetha Thomas, Nivetha Thomas and Regina Upcoming Movie Saakini Daakini

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో రీమేక్ తో వస్తున్నారు. రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా వుంది.

కాగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పైఅధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని. ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =