సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్

Salaar Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Salaar,Salaar Movie,Prabhas Salaar,Pan Indian Star Prabhas Salaar Movie,Salaar Movie Release Date,Salaar Pan India Movie Release Date Fixed,Salaar Movie Release Date Announced,Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Salaar Movie Releasing in 2023

రీసెంట్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కు ఆసినిమా కాస్త నిరాశనే మిగిల్చింది. ఇక ఫ్యాన్స్ ప్రభాస్ తరువాత సినిమాల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ ఇంకా పాన్ ఇండియా సినిమాలే. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు ఫ్యాన్స్ ఆసక్తికరంగా చూసేది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా గురించి. కె.జి.యఫ్ ఫ్రాంచైజీస్ తరువాత ప్రభాస్ తో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలం అవుతుంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 2023వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eighteen =