సీతారామం : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బింబిసార : ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “బింబిసార” మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో “బింబిసార” మూవీ 20 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది.
మాచర్ల నియోజకవర్గం : రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటించిన ఈ మూవీలో విలన్ గా సముద్రఖని నటించారు. అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందించారు .పక్కా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కడం తో ఈ మూవీ హీరో నితిన్ నటించిన డిఫరెంట్ మూవీ గా నిలిచింది. నితిన్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ కృతి శెట్టి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కార్తికేయ 2: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఈ రోజు (ఆగస్ట్ 13 వ తేదీ) తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. .ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.శ్రీకృష్ణుడు గురించి ద్వారక నేపథ్యంలో రూపొందటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన విజువల్స్ తో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీలో కార్తికేయ పాత్రలో నిఖిల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[totalpoll id=”85639″]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























