అమెరికన్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికకు ఆర్ఆర్ఆర్

rrr Movie gets nominated in prestigious american awards,Saturn Awards,American Awards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Full Movie,RRR Telugu Full Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Latest Update,RRR Movie Songs,RRR Movie Awards,RRR American Awards,American Saturn Awards,RRR Nominated American Saturn Awards,Saturn Awards Nominations,RRR In Saturn Awards,RRR Movie Nominated American Saturn Awards,JR NTR,Ram Charan,SS Rajamouli

మన తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ఖండాతరాలు దాటించగా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ఏకంగా మరో మెట్టు ఎక్కేశాడు. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది. ఈసినిమా హాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ప్రశంసించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్, హర్రర్ మరియు ఫాంటసీ చిత్రాలను గౌరవించే సాటర్న్ అమెరికన్ అవార్డుల నామినేషన్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఎంపికైంది. డీసీ బాట్‌మ్యాన్, మార్వెల్స్ డాక్టర్ స్ట్రేంజ్, షాంగ్ చై మరియు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లాంటి సినిమాలతో పాటు ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలో హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమా కూడా నామినేట్ అవ్వడం గొప్ప విషయం. అక్టోబర్ 25న అవార్డులను ప్రకటిస్తారు. ఒకటి కాదు రెండు కాదు మూడు కేటగిరీల్లో ఈసినిమాను ఎంపిక చేయడం జరిగింది. బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్షన్-అడ్వెంచరస్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీల్లో ఈసినిమా నామినేట్ అయింది.

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =