తెలుగు ఆడియన్స్ ప్రేమకు థ్రిల్ అయ్యా..!

Mrunal Thakur Thanks Telugu Audience For All The Love And Support,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Mrunal Thakur,Actress Mrunal Thakur,Actress Mrunal Thakur Thanks Audience,Mrunal Thakur Sitaramam Movie,Mrunal Thakur Thanks Telugu Audience For Love,Hanu Raghavapudi,Director Hanu Raghavapudi,Sitaramam Movie,Sita Ramam Telugu Movie,Mrunal Thakur Super Hit Movie Sita Ramam

మన తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎలా ప్రేమిస్తారో.. సినిమా హీరో హీరోయిన్లను కూడా అదే విధంగా ఆదరిస్తాన్న సంగతి తెలిసిందే కదా. ఏ ఇండస్ట్రీ నుండి వచ్చినా సరే ప్రాంతీయ బేధాలను అస్సలు పట్టించుకోకుండా సినిమాలను చూస్తారు.. సక్సెస్ అందిస్తారు.. వారిని అంతే ప్రేమతో ఆదరిస్తారు. ఇక ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూసి థ్రిల్ అవుతున్నా అంటుంది నార్త్ హీరోయిన్. ఆ నార్త్ హీరోయిన్ ఎవరో కాదు సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతాారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ సీతామహాలక్ష్మీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈసినిమాతో సాలిడ్ ఎంట్రీనే ఇచ్చిందని చెప్పొచ్చు మృణాల్ ఠాకూర్. చాాలా తక్కువమందికే మొదటి సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం సీతారామం సినిమాతో మృణాల్ కు దక్కింది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా మృణాల్ నటనకు ఫిదా అయ్యారు. ఈనేపథ్యంలో తెలుగు ఆడియన్స్ ఇచ్చిన వెల్ కమ్ కు అలానే ప్రేమకు థ్యాంక్స్ చెబుతుంది. ఈసినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు మేకర్స్. ఈసందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. నాకు ఇంతమంచి వెల్ కమ్ ఇచ్చినందుకు థ్యాంక్స్.. ఇదంతా డైరెక్టర్ హనురాఘవపూడి గారివల్లే జరిగింది.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇంత మెచ్యూర్ రోల్ ఇచ్చారు.. ఇక ముందు కూడా తెలుగులో మంచి రోల్స్ చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here