మాస్ మహారాజా రవితేజ హీరోగా “ధమాకా !” , “రావణాసుర “, “టైగర్ నాగేశ్వర రావు” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హీరో రవితేజ తన స్వంత బ్యానర్ ఆర్టీ టీమ్‌వర్క్స్ పై పలు మూవీస్ నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 4 మూవీ అనౌన్స్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై దర్శకుడు సతీష్ వర్మ దర్శకత్వంలో”కేరాఫ్ కంచరపాలెం” మూవీ ఫేమ్ కార్తీక్ రత్నం, ఖుషిత కల్లపు జంటగా ప్రొడక్షన్ నెం 4 మూవీ తెరకెక్కనుంది.ఈ మూవీ లో సత్య , రవిబాబు ముఖ్య పాత్రలలో నటించనున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ కి “ఛాంగురే బంగారు రాజా” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. “ఛాంగురే బంగారు రాజా” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: