200 కోట్ల క్లబ్ లో “విక్రాంత్ రోణ”

Vikrant Rona Movie Latest Collections

కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ విజువల్స్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ” విక్రాంత్ రోణ” మూవీ హీరో సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ”విక్రాంత్ రోణ” మూవీ నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. విశేష ప్రేక్షకాదరణ తో , అన్ని భాషలలోనూ దిగ్విజయం గా ప్రదర్శించబడుతున్న “విక్రాంత్ రోణ” మూవీ తాజాగా 200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here