వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5 వ తేదీ) భారీ అంచనాలతో తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందమైన ప్రేమ కథ గా తెరకెక్కిన “సీతారామం” మూవీ కి ప్రీమియర్ షోస్ తో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. రష్మిక , సుమంత్ తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: