శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి. అయితే ఆ వివాదాలకు కూడా ఫుల్ స్టాప్ పడింది. శంకర్ తన ప్రాజెక్ట్ లు పూర్తి చేసి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేయలన్న ఒప్పందానికి వచ్చారు. ఇది జరిగి కూడా చాలా రోజులైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దాదాపు ఈసినిమా గురించి అందరూ మరిచిపోయారు. అయితే తాజాగా మరోసారి ఈసినిమా తెరపైకి వచ్చింది. దానికి కారణం కాజల్ అగర్వాల్. అదేంటి కాజల్ అగర్వాల్ తన కొడుకుతో ఎంజాయ్ చేస్తుంటే తన వల్ల ఇండియన్2 సినిమా తెరపైకి రావడం ఎంటబ్బా అనుకుంటున్నారా..! అసలు సంగతేంటంటే.. తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇండియన్ 2 సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీ నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలిపింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. మరి కాజల్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి తనే కన్ఫామ్ చేయడంతో ఖచ్చితంగా నిజమే అంటున్నారు.
మరి శంకర్ మరోవైపు రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా అయిపోయిన తరువాత ఇండియన్ 2 సినిమానే పట్టాలెక్కించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఆర్సీ 15 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక కాజల్ చెప్పినదానిబట్టి చూస్తే నెల రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: