పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. సౌత్, నార్త్ లో గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కాస్త వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తాడన్న సంగతి తెలిసిందే కదా. రెండు మూడు రోజుల క్రితమే మెట్రో ట్రైన్ లో ప్రమోషన్స్ చేశారు. ప్రస్తుతానికైతో పలు ప్రమోషన్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక లైగర్ చిత్రయూనిట్ ప్రతి అంశాన్ని బాగానే వాడుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా లైగర్ టీమ్ ఇద్దరు సూపర్ స్టార్లను కలిసి వాళ్ల బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్, చిరు కాంబినేషన్ ఓపాటను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసెట్స్ కి హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీ వెళ్లడం జరిగింది. ఈనేపథ్యంలో లైగర్ చిత్రానికి సల్మాన్, చిరంజీవి బెస్ట్ విషెస్ తెలియజేశారు. మూవీ మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. సల్మాన్, చిరంజీవితో కలిసి విజయ్ దేవరకొండ, ఛార్మీ, పూరీ జగన్నాథ్ ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారాయి.
కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: