బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన “గార్గి “మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన ఫేవరెట్ ప్లేస్ గురించి చెబుతూ ..బీచ్ తనకు ఫేవరెట్ ప్లేస్ అనీ , తనకు సముద్ర తీరం అంటే చాలా ఇష్టమనీ , ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా బీచ్ కు వెళ్లేందుకు ఇష్టపడతాననీ , అయితే సముద్రతీరం అంటే ఎందుకంత ఇష్టమనేది తాను చెప్పలేననీ ,కానీ అలా నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతి వర్ణించలేనిదనీ , ధ్యానం చేసినట్టుగానే ఉంటుందనీ , మనసుకు ప్రశాంతంగా ఉంటుందనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: