కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ 4వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్ గాగుల్స్ ధరించి స్టైలిష్ గా సూపర్ కూల్ గెటప్ లో ఉన్న చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లు కలిసి చేస్తున్న “ది బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” (మాస్ సాంగ్) షూటింగ్ పూర్తయిందని టీమ్ ప్రకటించింది. థమన్ ఎస్ స్వరకల్పన లోని ఈ సాంగ్ కు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మెగాస్టార్ – సూపర్ స్టార్ కలయికలో ఈ పాట సంథింగ్ స్పెషల్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. పైగా ప్రభుదేవా మార్క్ కొరియోగ్రఫీ అదనపు అస్సెట్. ముగ్గురు స్టార్స్ చిరంజీవి , సల్మాన్ ఖాన్ , ప్రభుదేవా లతో తెరకెక్కిన ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుందనటం లో సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: