‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ వేదిక ఖరారు..!

Macherla Niyojikavargam Movie Trailer Launch Venue Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam Movie,Macherla Niyojikavargam Telugu Movie,Macherla Niyojikavargam Movie Latest Updates,Macherla Niyojikavargam Trailer, Macherla Niyojikavargam Movie Trailer,Macherla Niyojikavargam Telugu Movie Trailer,Nithiin Macherla Niyojikavargam Movie Trailer Launch Date Fixed,Macherla Niyojikavargam Trailer Launch Date Fixed, Macherla Niyojikavargam Trailer launch Venue Fixed,Macherla Niyojikavargam Trailer Launch Venue,Nithiin Upcoming Movie Macherla Niyojikavargam launch Venue Confirmed

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నితిన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మొద‌టి సారిగా నితిన్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇక ఇప్ప‌టికే ఈసినిమా నుండి విడుద‌లైన గ్లింప్స్ కానీ టీజర్, పాటలు ఇలా అన్నీ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ ను జులై30 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వేదికను ఖరారు చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌కు స‌ర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను విడుద‌ల చేశారు. గుంటూరులోని బ్రోడిపేట్ ఎల్ఈఎమ్ స్కూల్ గ్రౌండ్ లో ఈసినిమా ప్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + ten =