మల్లిడి విశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా బింబిసార. పీరియాడిక్ డ్రామాగా సోషియో ఫాంటసీ గా ఈసినిమా తెరకెక్కుతుడటం.. కళ్యాణ్ రామ్ మొదటిసారి విభిన్నమైన కథతో వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈసినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 29వ తేదీన హైద్రాాబాద్ లోని శిల్ప కళావేదికలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా వస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అతిథిగా రానున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ‘బింబిసార’ చిత్రంలో కల్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్, ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ రావణ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని సీన్లను కలిపి రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. వస్తున్నా అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ వాయిస్ వినిపించారు.
VASTUNNADU 🔥💥@tarak9999 is all set to join @NANDAMURIKALYAN & #Bimbisara team at the Grand Pre-Release Event as the chief guest.
🗓️ 29th July
📍 Shilpakala Vedika,HYD.#NTRforBimbisara #BimbisaraOnAugust5th @NTRArtsOfficial pic.twitter.com/R5cgqug78I— Telugu FilmNagar (@telugufilmnagar) July 26, 2022
కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































