‘మాచర్ల నియోజకవర్గం’ నుండి నితిన్ దమ్కీ..!

Macherla Niyojikavargam Dhamki Out Now,Macherla Dhamki: Nithiin’s Macherla Niyojakavargam Trailer Glimpse And Date Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie,Macherla Niyojakavargam Latest Updates, Macherla Niyojakavargam Action Glimpse Will Release Now,Action Glimpse From Nithin’s Macherla Niyojakavargam Will Be Out Now, Actor Nithin’s Macherla Niyojakavargam,Macherla Dhamki,Nithins Upcoming Movie,Nithin New Movie Updates,Nithin Action Glimpse Out Now,Macherla Niyojakavargam Trailer Glimpse And Date Out Now, Nithiin’s Macherla Niyojakavargam Trailer Glimpse And Date Out Now

హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు నితిన్. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘రారా రెడ్డి’ అనే సాంగ్‌ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గానే అదిరిందే పాటను రిలీజ్ చేయగా.. నేడు మాచర్ల దమ్కీ అంటూ వచ్చేశాడు. మాచర్ల దమ్కీ అంటూ రిలీజ్ అయిన ఈ వీడయోలో.. మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం ఎన్నోలక్షల మంది తమ సమాధులను పునాదులుగా వేశారు.. ఈ మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్దం అంటూ నితిన్ చెప్పే డైలాగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.

కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =