10 భాషల్లో ‘పుష్ప2’

Pushpa The Rule Movie Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa The Rule,Pushpa The Rule Movie,Pushpa The Rule Telugu Movie,Pushpa The Rule Movie Updates,Pushpa The Rule Upcoming Movie,Allu Arjun Pushpa The Rule Movie latest Updates, Pushpa The Rule in 10 Languages,Pushpa The Rule Movie To Release in 10 Languages,Pushpa The Rule Movie Releases in 10 Languages,Allu arjun and Rashmika part 2 Movie Pushpa The Rule, Pushpa part 2 Movie Updates,Director Sukumar Upcoming Movie Pushpa Part 2

ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప పార్ట్ 2 కోసం. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో మొదలుపెడుతున్నట్టు వార్తలు వచ్చినా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. ఇక ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ లో కానీ .. సెప్టెంబర్ లో కానీ ప్రారంభించనున్నట్టు ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ గ్యాప్ లో పలు వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాలో పలువురు నటిస్తున్నారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. పుష్ప పార్ట్ 1 ను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈసినిమాను 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనూ ఈ సినిమాను విడుదల చేయలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈసినిమా. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన అల్లు అర్జున్ పాన్ ఇండియా వద్ద తన సత్తా చూపించాడు. పుష్ప డైలాగ్స్, పాటలు, స్టెప్పులు దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో కూడా చూశాం. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈసినిమాను నిర్మించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =