పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 12 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కార్తికేయ 2″మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ప్రమోషన్స్ భాగంగా హీరో నిఖిల్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో వచ్చే సీరియల్ లో నిఖిల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ‘రాధమ్మ కూతురు’ అనే సీరియల్ లో ఓ సందర్భంలో మహిళను కాపాడి ఆమెను పెళ్లి మండపానికి తీసుకెళ్లే సన్నివేశంలో అఖిల్ కనిపించారు. ఈ సీరియల్ లో నిఖిల్ కి ఒక యాక్షన్ సీన్ కూడా ఉంది.
మొత్తానికి బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి నిఖిల్ బుల్లి తెరపై నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: