అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ “- రజిష విజయన్

Rajisha Vijayan About Ravi Teja Ramrao on Duty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramrao on Duty,Ramrao on Duty Movie,Ramrao on Duty Telugu Movie,Ramrao on Duty latest Updates,Mass Maharaja Ravi Teja,Ravi Teja Upcoming Movie Ramrao on Duty, Rajisha Vijayan,Actress Rajisha Vijayan About Ramrao on Duty Movie,Rajisha Vijayan About Ramrao on Duty Movie, Rajisha Vijayan Love Ramrao on Duty Movie,Rajisha Vijayan Upcoming Movies,Rajisha Vijayan Movie Updates,Rajisha Vijayan Latest Interview,Ravi Teja Movie Updates,Ravi Teja latest Movies, Ravi Teja Next Project

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ట్రైలర్ ను 16 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ధర్మం కోసం డ్యూటీ చేస్తా, అసలు వేట మొదలైంది వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న మలయాళ బ్యూటీ రజిష విజయన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తమిళ భాషలో ధనుష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “కర్ణన్” మూవీ తనకు మంచి పేరు తీసుకొచ్చిందనీ , “రామారావు ఆన్ డ్యూటీ “లో నటించే అవకాశం రావడానికి కారణం ఆ చిత్రమేననీ , తెలుగులో ఇది వరకు కూడా తనకు ఆఫర్లు వచ్చాయనీ , కానీ బలమైన కథ, కథనాలున్న సినిమా కోసం ఎదురు చూశాననీ , ఆ అవకాశం “రామారావు ఆన్‌ డ్యూటీ”తో దక్కిందనీ , ఇందులో తన పేరు మాలిని అనీ , చాలా హుషారైన పాత్రఅనీ , నటనకు ఆవకాశం ఉందనీ , రవితేజ లాంటి సీనియర్‌ హీరోతో నటించడం గొప్ప అదృష్టం అనీ , ఆయన చాలా సరదాగా ఉంటారనీ , సెట్‌కి వస్తే.. ఓ మెరుపు మెరిసినట్టే ఉంటుందనీ , ఆయన నటించిన కొన్ని సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ చూశాననీ , ఇప్పుడంటే పాన్‌ ఇండియా అంటున్నారు గానీ, అప్పట్లోనే రవితేజ చిత్రాలకు ఆ రీచ్‌ ఉండేదనీ , ‘రామారావు ఆన్‌ డ్యూటీ” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమనీ , ఈ మూవీ తరువాత తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఉందనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =