పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మికతెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా ఒక హిందీ మూవీ తెరకెక్కనుంది.ఈ మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
14 రీల్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “, “సర్కారు వారి పాట” మూవీస్ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో కథానాయికగా రష్మిక ను దర్శకుడుపరశురామ్ సంప్రదించినట్టు , స్టోరీ లైన్ నచ్చడం తో రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు పరశురామ్ , రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన “గీత గోవిందం” మూవీ రష్మిక కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: