విశాల్ ‘లాఠి’ టీజర్ గ్లింప్స్ రిలీజ్..!

Vishal Laththi Movie Teaser Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laththi,Laththi Movie,Laththi Telugu Movie,Laththi Movie Latest Updates,Laththi Movie Teaser Glimpse Out Now,Laththi Teaser Glimpse Out Now,Laththi Movie Teaser, Vishal Laththi Movie Teaser,Vishal Laththi Movie latest Teaser Glimpse Out Now,Vishal Upcoming Movie Laththi,Laththi New Movie of Hero Vishal,Star Hero Vishal, Vishal Upcoming Movie Laththi,Vishal Next Project,Vishal Upcoming Project

ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠి. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నాడు. ఇక ముందుగా ఆగష్ట్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఈసినిమా పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా టీజర్ గ్లింప్ల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కోలీవుడ్ లో స్టార్ హీరోలంతా నటించిన పోలీస్ స్టోరీస్ లో నుంచి సీన్స్ ను తీసుకొని ఈ టీజర్ గ్లింప్స్ ని కట్ చేశారు. అందరు స్టార్ హీరోలను పోలీస్ గెటప్స్ లో చూపించి ఫైనల్ గా విశాల్ ని రివీల్ చేశారు. ఒక్క సీన్ తోనే సినిమాలో విశాల్ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చూపించేశారు. ఇక చివరిలో టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు 24వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =