వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రాజక్ట్ కె” మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ప్రస్తుతం హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా లతో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్న కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తో రామోజీ ఫిల్మ్ సిటీ సందడి గా మారిందని సమాచారం. “ప్రాజెక్ట్ K ” మూవీ తో పాటు హీరో ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: