“కోబ్రా”మూవీ ఆడియో వేడుకలో విక్రమ్

Vikram In Cobra Movie Audio Launch Function,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Cobra,Cobra Movie,Cobra Movie Audio Launch,Cobra Audio Launch Function,Vikram Cobra Movie Audio Launch Function,Vikram Attend Audio Launch Fuction of Cobra, Vikram Health Conditions,Vikram Movie Songs,Vikram Upcoming Movie Cobra,Vikram In Audio Launch of Cobra Movie,Vikram Upcoming movies,Vikram New Movie Updates

గత కొన్ని రోజులు క్రితమే కోలీవుడ్ ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ తనకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరో విక్రమ్ హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. తరువాత విక్రమ్ కోలుకున్నాక అందరి కోసం తన ఆరోగ్యం బాగానే ఉందని ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ శ్రీనిధిని శెట్టి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “కోబ్రా “తమిళ మూవీ ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.“కోబ్రా” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకుని నటించే హీరో విక్రమ్ 58 వ మూవీ గా తెరకెక్కిన “కోబ్రా”మూవీలో 20 కు పైగా గెటప్స్ తో విక్రమ్ కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు.“కోబ్రా” మూవీ ఆడియో వేడుక నిన్న చెన్నై లో జరిగింది. ఆ వేడుకలో విక్రమ్ పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచారు. తన సినిమా పట్ల ఉన్న కమిట్ మెంట్ ని తెలియజేస్తూ అభిమానుల కోసం విక్రమ్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − 1 =