‘ఎఫ్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

F3 Movie OTT Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Updates,F3 Movie In OTT,F3 Movie In SonyLiv,F3 Movie Release Date in OTT Fixed, F3 Movie in OTT Release Date Fixed,F3 Movie Latest Updates,F3 upcoming Movie In OTT,Latest OTT Movies To Release,OTT Movies In July,Upcoming Movie In SonyLiv,F3 Movie in SonyLiv,F3 Movie on July 22nd in SonyLiv

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎఫ్3. ఎఫ్ 2 సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. కరోనా కంటే ముందే ఈ చిత్రాన్ని ప్రారంభించినా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు ఈ ఏడాది మే 27న విడుదలైంది. ఇక కామెడీ ఎంటర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పుడే మా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయట్లేదంటూ.. రిలీజ్ అయి 8 వారాలు అయిన తరువాతే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జూలై 22 నుంచి ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

కాగా ఈసినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈసినిమాను నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − two =