అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో తన మార్క్ ను క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత తను మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ కేవలం సౌత్ లో మాత్రమే కదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే తన సినిమాల నుండి ఏ అప్ డేట్ వచ్చినా కూడా అది కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు అలా అప్ డేట్ వచ్చిందో లేదో అప్పుడే కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. పూరీ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా నుండి నేడు విజయ్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. విజయ్ న్యూడ్ గా ఉన్న ఆ ఫొటో అందరికీ షాకివ్వడమే కాదు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఫొటోకు ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అంతేకాదు పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఈపోస్ట్ పై స్పందిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేసిన నాలుగు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఫాస్టెట్ లైక్ట్ ఫొటోగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటూ మరోపక్క ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
<div>




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: