హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Achieves Another Rare Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR pan Indian Movie,RRR Movie New Records,Hollywood Critics Association,RRR Movie New Record in Hollywood,RRR in Hollywood,SS Rajamouli Movie RRR New Record, RRR Movie Listed Top Ten in Hollywood Critics Association,Hollywood Critics Association Listed RRR Movie In Top Ten,Hollywood Critics Association Listest RRR Movie as Best Film in Top 10,Jr NTR and Ram Charan,Jr NTR and Ramcharan Multi Starrer Movie RRR Creates New Record in Hollywood,Jr NTR and Ram Charan RRR Telugu Movie,

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఓటీటీ తో పాటు యూఎస్, యూకే లాంటి దేశాల్లో ఇంకా స్పెషల్ షోలు రన్ అవుతున్నాయి. తాజాగా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీని ప్రపంచవ్యాప్తంగా మరో 30 కి పైగా దేశాలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ నామినేట్ కావడం విశేషం. టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తప్ప మిగతా అన్ని చిత్రాలు కూడా హాలీవుడ్ నుంచే ఉండగా వాటిలో ఫస్ట్ టైమ్ ఎంపిక కాబడిన ఇండియన్ చిత్రంగా “ఆర్ ఆర్ ఆర్ “నిలిచింది. దీనితో చిత్ర యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =