సిని సెలబ్రిటీల పై రూమర్స్ రావడం కామన్ థింగే. కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు.. వ్యక్తిగత విషయాల గురించి కూడా రూమర్లు పుట్టుకొస్తుంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఆ రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. గత కొద్ది రోజులుగా రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు జోరుగా ప్రసారమైన సంగతి తెలిసిందే కదా. చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్‌ను రామ్ పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు మరింత ఎక్కువవడంతో ఫైనల్ గా రామ్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈవార్తలపై తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఓ మై గాడ్.. ఇక ఆపండి.. నా సొంత ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి కూడా సమాధానం చెప్పుకోవాల్సినంత వరకూ వచ్చింది పరిస్థితి.. నేను నా స్కూల్ ఫ్రెండ్‌ని, సీక్రెట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటున్నాను అనే రూమర్లు ఇంటి వరకూ చేరాయి.. వారికి కూడా అవన్నీ రూమర్లేనని చెప్పుకునే పరిస్థితి వచ్చింది.. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు.. నేను చిన్నప్పుడు సరిగ్గా స్కూల్‌కి కూడా వెళ్లేవాడిని కాదు’ అంటూ రామ్ పోస్ట్ లో పేర్కొన్నాడు. మరి ఇప్పటికైనా ఈవార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.
Oh God! Stop! …it’s reached a point wherein I’m having to convince my own family & friends that I’m not getting married to any “secret high school sweetheart”!
TBH,I hardly went to high school..🤷♂️🙏
— RAm POthineni (@ramsayz) June 29, 2022
కాగా ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: