లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా జులై8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. మత్తువదలరా సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించాడు రితేష్ రానా. లావణ్య త్రిపాఠి ఇంకా వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను సాలిడ్ కామెడీని అందించనున్నట్టు అర్థమవుతుంది. మత్తువదలరా సినిమాలో సీరియల్ కామెడీ కూడా ఒక హైలెట్ గా నిలిచింది. ఇందులో కూడా సీరియల్ ఫన్నీ ఎపిసోడ్ ని చూపించి సర్ ప్రైజ్ చేశారు. సినిమాటోగ్రఫీ, కాల భైరవ మ్యూజిక్ బాగున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నరేష్ అగస్త్య కూడా నటించాడు. ఈసినిమాలో ఇంకా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: