వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా-సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా విరాటపర్వం. ఈసినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈసినిమా రావడంతో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది.నక్సలిజం నేపథ్యంలో ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ అంశాలతో ఈ మూవీని దర్శకుడు వేణు ఎంతో అద్భుతంగా తెరకెక్కించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ఈసినిమా జులై 1న ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకి అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A relentless quest for love and freedom!
Get ready to experience the world of Virata Parvam, coming to Netflix on 1st of July in Telugu, Malayalam and Tamil! #VirataParvamOnNetflix pic.twitter.com/44ks2WaJLl
— Netflix India South (@Netflix_INSouth) June 29, 2022
కాగా ఈసినిమాలో నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషించారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటించారు. విరాటపర్వం మూవీకి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































