‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

The Warrior Movie Trailer Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warrior,The Warrior Movie,The Warrior Telugu Movie,The Warrior Latest Upates,The Warrior Movie Updates,The Warrior Trailer Release Date Fixed,The Warrior Movie Trailer Updates, The Warrior Telugu Movie Trailer Latest Release Date Fixed,Ram The Warrior Movie Trailer Release Date Confirmed,Ram Pothineni,Hero Ram,Ram Upcoming Movie The Warrior,Ram latest Movie Udpates, Ram New Movie Updates,Ram latest Movies

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఇప్పుడు అదే జోష్ తో ది వారియర్ అంటూ వస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రెండు పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మొదటి పాటగా రిలీజ్ చేసిన ‘బుల్లెట్’ సాంగ్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత రిలీజ్ చేసిన ‘విజిల్’ సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని ఇప్పటికే ఈ పాట 12 మిలియన్ ప్లస్ వ్యూస్ ను తెచ్చుకోవడం విశేషం. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. జులై1వ తేదీన సాయంత్రం 7గంటల 57 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా జూలై 14న విడుద‌ల కాబోతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =