మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను తన మార్క్ కామడీతో పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానునన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో వేగవంతం చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమా నుండి పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాాాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్ మరోసారి కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: