మెగా ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మిస్తూ ,డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ చిత్రంగా భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “#RC15″మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సమయంలో డిసెంబర్ 10, 2020లో దిల్ రాజు, తేజస్విని ల వివాహం నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దిల్’ రాజు ఇంటిలో సంతోష వాతావరణం నెలకొంది. ఆయన ఇంటికి వారసుడొచ్చాడు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు ‘దిల్’ రాజుకు కంగ్రాట్స్ చెబుతున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























