ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ మహానటితో మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే సినిమా చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అయింది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ‘లెఫ్టినెంట్ రామ్.. నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్క పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ అంటూ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. ”డియర్ రామ్! నీకు ఎవరూ లేరా? ఈ అబద్దాలు ఎక్కడ నేర్చున్నావయ్యా కొత్తగా! ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్. నిన్నే గుర్తు చేసుకుంటూ… నీ భార్య సీతా మహాలక్ష్మి” అని ఒక ఉత్తరంలో ఉంటుంది. ‘సీత… ఎవరు నవ్వు?’ అని ఆలోచించడం రామ్ వంతు అయ్యింది. ఆ తర్వాత దుల్కర్, మృణాల్ జంటను చూపించారు. టీజర్ మాత్రం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: