ఇప్పుడున్న రోజుల్లో సినిమాను ఎంత వెరైటీగా ప్రమోషన్ చేస్తే సినిమాకు అంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే మేకర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తో వస్తున్నారు. సినిమాపై హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక 7 డేస్ 6 నైట్స్ సినిమా కూడా ఇప్పుడు అదే రూట్ లో వెళుతుంది. ఈసినిమా ఈ నెల 24న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే మూడు ట్రైలర్ లను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాాగా చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా చార్మినార్ ను సందర్శించింది. 7 డేస్ 6 నైట్స్ టీమ్ ఆ ప్రదేశం చుట్టూ తిరిగారు. ఈ సందర్భంగా అశ్విన్ చార్మినార్ తనకెంతో ప్రత్యేకమని.. తమ సినిమాని థియేటర్లలోకి వచ్చి చూడాలని, సినీ ప్రేమికులనూ అభ్యర్థించారు. కాగా 2003లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు సినిమాకు ఎం.ఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ సినిమాలో వేసిన చార్మినార్ సెట్ కు ఎంత ప్రత్యేకత ఉందో కూడా తెలిసిందే. ఆ సినిమా మహేష్ కు సంచలన విజయం అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Remembering #Okkadu memories at Charminar, our young team of fun film #7Days6Nights seem confident about the response to their film ✨@SumanthArtPro @MSRajuOfficial@MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/EADRKLy9IB
— MS Raju (@MSRajuOfficial) June 23, 2022
కాగా ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. మరో జంటగా రోహన్, క్రితికా శెట్టి నటిస్తున్నారు. సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: