మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఐదు సినిమాలు వరకూ రవితేజ లిస్ట్ లో ఉన్నాయి. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో డిప్యూటీ కలెక్టర్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా రిలీజ్ కూడా ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తుంది. సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని అనుకున్నారు. ఆతర్వాత జూన్ 17 న విడుదల చేయాలని భావించారు. అది కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇక మరోవైపు ఈసినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. జూలై 29న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Duty begins from JULY 29th ! See you at the theatres 🙂#RamaRaoOnDuty #RamaRaoOnDutyOnJULY29 😎 pic.twitter.com/SOESJYmrbb
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2022
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరి ఈసినిమాతో రవితేజ హిట్ కొడతాడో లేదో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: