‘విజయ్ 66’ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Thalapathy66 First Look and Title Out,Thalapathy66 Titled Varisu,First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thalapathy66,Thalapathy66 Movie,Thalapathy66 Telugu Movie,Thalapathy66 Movie Updates,Thalapathy66 latest News,Thalapathy66 First Look Out Now, Thalapathy66 First Look From Movie Out Now,Thalapathy66 latest Look From movie Released,Thala Vijay First Look From Thalapathy66 Released, Thala Vijay Upcoming Movie Thalapathy66,Thalapathy Vijay Upcoming Movie Thalapathy66 Latest First Look Released,Thalapathy66 Titled Varisu First Look Released,Varisu,Varisu Movie, Varisu Movie Updates

ప్రస్తుతం తమిళ్ హీరోలు తెలుగులో, తెలుగు హీరోలు తమిళ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్లు కేవలం డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం తెలుగుతో పాటు తమిళ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్‌ను ఇచ్చారు చిత్ర యూనిట్. పోస్టర్‌లో విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. క్లాస్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘వారిసు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ తో వస్తుంది.

కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =