మాస్ మహారాజా రవితేజ కూడా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమాను జూన్ 17వ తేదీన ఈసినిమా ను రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని చెప్పారు కానీ ఇంతవరకూ దానికి సంబంధించిన అప్ డేట్ రాలేదు. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. మాస్ మహారాజా ఛార్జ్ తీసుకోవడానికి రెడీ అయ్యాడంటూ ఈసినిమా నుండి అప్ డేట్ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఇవ్వనున్నట్టు తెలిపారు. మరి ఈసినిమా రిలీజ్ అప్ డేట్ వస్తుందేమో అని రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: