మెగా స్టార్ చిరంజీవి తనయుడు సూపర్ హిట్ “చిరుత “మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్” మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RC15 “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగా స్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్ “, “భోళా శంకర్ “, “మెగా 154″మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి (చిరంజీవి )కి సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అరుదైన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. పదేళ్ల ప్రాయంలో ఉన్నరామ్ చరణ్ , చిరంజీవితో కలసి ఉన్న ప్రత్యేకమైన ఫోటో అది. తండ్రీకొడుకులు స్కై బ్లూ టీ షర్ట్స్ ధరించి ఫోటోకి ఫోజిచ్చారు. ఇక రామ్ చరణ్ షేర్ చేసిన ఆ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: