డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం యూఎస్ లో ఓ అరుదైన ఘనతను అందుకుంది. అక్కడి అతి పెద్ద పబ్లిషన్స్ అయినటువంటి యూఎస్ఏ టుడే వారు ఈ ఏడాదికి రిలీజ్ అయ్యిన అన్ని చిత్రాల్లో”ఆర్ ఆర్ ఆర్ ” చిత్రాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రకటించారు. ఈ లిస్ట్ లో పలు హాలీవుడ్ భారీ చిత్రాలు కూడా ఉన్నాయి కానీ వాటిని మించి ఈ చిత్రాన్ని నెంబర్ 1 సినిమాగా వారు కొనియాడారు. దీనితో ఈ ప్రౌడ్ మూమెంట్ ని ఎంతో గర్వంగా చిత్ర యూనిట్ షేర్ చేసి థాంక్స్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: