బ్లాక్ బస్టర్ “మై నేమ్ ఈజ్ ఖాన్ ” మూవీ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ కు పరిచయం అయిన వరుణ్ ధావన్ ,సూపర్ హిట్ ” స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ ప్రస్తుతం “జుగ్ జుగ్ జియో”, “భేడియా ” మూవీస్ షూటింగ్స్ ను కంప్లీట్ చేశారు. వరుణ్ హీరోగా “బవాల్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధర్మా ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై రాజ్ మెహతా దర్శకత్వంలో వరుణ్ ధావన్ , కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన”జుగ్ జుగ్ జియో” హిందీ మూవీ జూన్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతూ .. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో నటించాలనే కోరికను వెల్లడించారు. సూపర్ హిట్ “స్టూడెంట్ నెం 1 “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ “బాహుబలి”, “ఆర్ ఆర్ ఆర్ “వంటి మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: