సూపర్ హిట్ “బంగార్రాజు “మూవీ తో ప్రేక్షకులను అలరించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్” మూవీ గోవా , ఊటీ , దుబాయ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. “రచ్చ “, “సీటీమార్” మూవీస్ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం లో హీరో నాగార్జున మరో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ”బ్రహ్మాస్త్ర ” లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: