బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NTR30” మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పాటు కొందరు స్నేహితులతో కలిసి వెకేషన్ కు సింగపూర్ కి వెళ్లారు. అక్కడ సమ్మర్ వెకేషన్ ను ఎన్టీఆర్ ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. సింగపూర్ లో ఎన్టీఆర్ ని చూసిన కొందరు ఫ్యాన్స్ ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానుల సంఖ్య పెరిగింది. కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ ఈ ట్రిప్ ని ముగించుకొని హైదరాబాద్ రానున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: