మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తను ఎదురుచూస్తుంది ఎఫ్ 3 సినిమా కోసం. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు తన తరువాత ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నాడు వరుణ్ తేజ్. ఎఫ్3 ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ తన తరువాత సినిమా గురించి చెబుతూ ప్రవీణ్ సత్తారు తోనే నెక్స్ట్ సినిమా ఉందని.. ఈసినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలిపాడు. అంతేకాదు.. ఈసినిమా లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అందుకే షూటింగ్ మొత్తం అక్కడే జరపనున్నామని.. ఈసినిమా ఖచ్చితంగా కొత్త వైబ్ ను ఇవ్వబోతుందని చెప్పాడు. చూద్దాం మరి ఆసినిమా విశేషాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా అయిపోయిన తరువాత వరుణ్ తో సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈసినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: