గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. కామెడీతో ఎలా అయితే నవ్వించగలడో ఎమోషనల్ కథలతో కూడా ప్రేక్షకులను ఏడిపించగలడు నాని. ఆ విషయం మరోసారి జెర్సీ సినిమాతో నిరూపించాడు. ఈసినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అందుకే ఈసినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాదు.. నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను హిందీ లో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈసినిమాకు కూడా గౌతమ్ తిన్ననూరియే దర్శకత్వం వహించాడు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈసినిమాను చూసిన పాకిస్థానీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ కూడా ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. షాకిద్ కపూర్ వాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫైరింగ్ ఫిలిం.. గ్రేట్ వర్క్ బ్రదర్ అంటూ ట్విట్ చేశాడు.
@shahidkapoor what a beautiful and inspiring film great work brother 👏 #Jersey
— Mohammad Amir (@iamamirofficial) May 25, 2022




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: