శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ ఈ రోజు ( 27 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“F 3” మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో ప్రదర్శించబడుతుంది. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సన్నివేశాలు , వరుణ్ తేజ్ తో సీన్స్ , క్లైమాక్స్ లో తన కామెడీ యాంగిల్ తో, తన మాడ్యులేషన్ తో వెంకటేష్ ప్రేక్షకులను అలరించారు.వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ , రాజేంద్ర ప్రసాద్ , వెన్నెల కిషోర్ తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “F 3” మూవీ ప్రేక్షకులను నవ్వులతో అలరిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: